- Advertisement -

ప్రోమోని చూసి క‌న్నీరు పెట్టుకున్న కౌశ‌ల్ భార్య‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొద‌టి నుంచి ఒక్క‌డి చూట్టునే తిరుగుతుంది.షో మొద‌టి నుంచి హౌస్‌మెట్స్ అంద‌రు ఒక‌వైపు కౌశ‌ల్ ఒక్క‌డే ఒక‌వైపు ఉంటు వ‌స్తున్నారు.హౌస్‌లో ఎంత‌మంది ఉన్న కౌశ‌ల్ చూట్టునే షో న‌డుస్తుంది.కౌశ‌ల్‌ను టార్గెట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రు ఎలిమినేష‌న్ అయి హౌస్‌ నుంచి బ‌య‌టికి వెళ్ల‌డం మ‌నం చూస్తునే ఉన్నాం.గత రెండు వారాలుగా షోని చూస్తే కౌశ‌ల్‌ని ఎంత బ్యాడ్ చేయ‌లో అంత బ్యాడ్‌గా చేస్తున్నారు మిగిలిన ఇంటి స‌భ్యులు.డైరెక్ట్ టికెట్ ఫైన‌ల్ టాస్క్‌లో విఫ‌లం అయినందుకు ఈ వారం నామినేష‌న్‌లో ఇంటి స‌భ్యులు అంద‌రు ఉండ‌టంతో ,ఇదింతా కౌశ‌ల్ వ‌ల్లే అని కౌశ‌ల్‌ని టార్గెట్ చేశారు ఇటి స‌భ్యులు.

ఇక మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎపిసోడ్ బిగ్‌బాస్ ఇచ్చిన మీ ఇసుక జాగ్ర‌త టాస్క్ కూడా వివాదంగానే మారింది.తనీష్‌,కౌశ‌ల్ వ్య‌క్తిగ‌తంగా తీసుకుని కొట్టుకునే స్థాయికి వెళ్ల‌డంతో టాస్క్‌ని మ‌ధ్య‌లోనే ఆపేశారు బిగ్‌బాస్.తాజాగా బుధ‌వారం జ‌రిగే ఎపిసోడ్ ప్రోమోని విడుద‌ల చేశారు. ఈ ప్రోమోలో కూడా ఇంటి సభ్యులు కౌశ‌ల్‌పై ముకుమ్మ‌డి దాడి చేశారు.కౌశల్ తన మీద అందరు ఎటాక్ చేస్తున్న విధానాన్ని చెబుతూ తన దగ్గరకు వచ్చే సరికి అందరు కుక్కల్లా మీద పడతారని అన్నాడు. కుక్కల్లా అనేసరికి హౌస్‌లో ఉన్న మిగతా ఇంటి సభ్యులు కౌశ‌ల్‌పై ఫైర్ అవుతున్నారు.

ఈ ప్రోమో చూసిన కౌశ‌ల్ భార్య క‌న్నీరు పెట్టుకుంద‌ట‌. కౌశ‌ల్‌ని ఒక్క‌డిని చేసి ఇలా చేయడంతో ఆమె చాలా బాధ‌కు లోనైందని తెలుస్తుంది.నా భ‌ర్త బిగ్‌బాస్ విన్న‌ర్ కాక‌పోయిన ఫ‌ర్వాలేదు ,ఇలా అంద‌రి చేత మాట‌లు ప‌డ‌టం త‌నకు ఇష్టం లేద‌ని గ‌తంలోనే కౌశ‌ల్ భార్య చెప్పింది.కాని కౌశ‌ల్ నీతి నిజాయితీని ,అత‌ను ఆడుతున్న విధానం న‌చ్చి బ‌య‌ట భారీ ఫాలోయింగ్ వ‌చ్చింది.కౌశ‌ల్ ఆర్మీ కౌశ‌ల్ భార్య‌కు మ‌ద్ద‌తుగా నిల‌వడంతో ఆమె కాస్తా కుదుట ప‌డింద‌ట‌. ఈ రోజు (బ‌ధ‌వారం) ప్రోమోని బ‌ట్టి చూస్తే ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -