టాలీవుడ్ కమర్షియల్ దర్శకులలో బోయపాటి కూడా ఒకరు. తన సినిమాలలో హీరోని అమాంతం పైకి లేపుతాడు బోయపాటి. భద్ర, తులసి, సింహా,లెజెండ్,సరైనోడు సినిమాలతో స్టార్ దర్శకుడిగా మారాడు. దీంతో స్టార్ హీరోలు సైతం ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. బోయపాటి ఇటీవల దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ. ఈ సినిమాలో హీరోగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. సినిమా ఏం బాలేదని మెగా ఫ్యాన్సే చెప్పడం విశేషం. 95 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 30 కోట్లకు నష్టాన్ని మిగిల్చింది. తాజాగా ఈ సినిమా విషయంలో బోయపాటి నిర్మాత డివివి దానయ్యతో గొడవ పడుతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక విషయం పక్కన పెడితే చిరుతో బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకు అల్లు అర్జున్ నిర్మాతగా వ్యవహారించనున్నాడు.
అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వినయ విధేయ రామ దెబ్బకు చిరంజీవి సైతం బోయపాటితో సినిమా అంటే భయపడిపోతున్నాడట. పైగా పారితోషకం తగ్గించుకోమన్న ,తగ్గించుకోకుండా నిర్మాతలను బోయపాటి తెగ ఇబ్బంది పెడుతున్నాడట. ఇటువంటి సమయంలో బోయపాటితో సినిమా అంటే కొంచెం కష్టమే అనే భావనలో చిరు ఉన్నాడని తెలుస్తోంది. చిరు ప్రస్తుతం సైరా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్, కొరటాల శివలతో పనిచేయడానికి రెడీగా ఉన్నాడు చిరు. ఇక బోయపాటి విషయానికి వస్తే మహేశ్‌తో సినిమా కూడా క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు ఆశలు అన్ని బాలయ్యతో తీసే సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ బోయపాటి అంటే ఏంటో చూపించాలని కసితో ఉన్నాడు. మరి బాలయ్య సినిమాను బోయపాటి ఏం చేస్తాడో చూడాలి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
