టాలీవుడ్ బడా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొద్ది రోజుల క్రితం ఓ యాక్సిడెంట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.సురేష్ బాబు కారు యాక్టివా బండి మీద వెళ్తున్న ముగ్గురిని ఢీ కొట్టింది.యాక్టివాని బలంగా గుద్దేయంతో దానిపై వెళుతున్న ముగ్గురు గాల్లో లేచి పడ్డారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే ఈ యాక్సిడెంట్ లో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా – ఒకరికి మాత్రం తీవ్ర గాయాలై ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే సురేష్ బాబు తాజాగా ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడారు.యాక్సిడెంట్‌పై ఆయన మాట్లాడుతు… కొంపల్లిలో ఉన్న ఓ ఫ్రెండు ఫ్యామిలీ ఫంక్షన్ కి ఎటెండ్ కావాల్సి ఉంది ఆరోజు. కానీ అది ఎగ్గొట్టి అత్తాపూర్ లో థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నా.
ఆ టైమ్ లో ఫోన్ వస్తే ఫంక్షన్ ఎగ్గొట్టి సినిమా చూస్తున్నానంటే బావుండదని వెంటనే కార్ లో కొంపల్లి బయల్దేరాను. ఆ ఫంక్షన్ కి వెళ్లి వస్తుండగానే సికిందరాబాద్ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. సడెన్ గా కారు టైర్ ఓ పెద్ద రాయి ఎక్కింది. టైర్ వెంటనే బరస్ట్ అవ్వడంతో అదుపుతప్పి వెళ్లి యాక్టివాని గుద్దింది.. అంటూ తనకు జరిగిన హారిబుల్ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.యాక్సిడెంట్‌లో గాయపడిన వారందరికి అవసరమైన అన్ని వైద్య ఖర్చులు భరించానని చెప్పుకొచ్చారు సురేష్ బాబు.
