Thursday, April 25, 2024
- Advertisement -

ఇండియా పౌర‌స‌త్వం లేక‌పోయిన ఓటేసిన దీపిక ప‌దుకునే

- Advertisement -

దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన నాల్గవ దశ ఎన్నికల్లో ప‌లువురు బాలీవుడ్ స్టార్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకునే ఓటు వేయడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎందుకంటే దీపిక ప‌దుకునేకు ఇండియా పౌర‌స‌త్వం లేదు. దీపిక ప‌దుకునే డెన్మార్క్‌లో పుట్టింది. ఆమెకు అక్క‌డ పౌర‌సత్వం ఉంది. ఆమె చాలా కాలం పాటు ఇండియాలో డెన్మార్క్ పాస్ పోర్ట్ పై ఉంది. అయితే ఓటు వేయడం కోసం త‌న పాస్‌పోర్ట్‌తో పాటు, డెన్మార్క్ పౌర‌సత్వాన్ని వ‌దులుకుంది.

ఓటు కోసం దీపిక తన డెన్మార్ పౌరసత్వంను రద్దు చేసుకుని ఇండియన్ సిటిజన్ అయ్యింది. అందుకే ఆమె ఇండియాలో ఓటు హక్కును వినియోగించుకోగలిగింది. దీపిక తో పాటు ఆమె భర్త రణ్ వీర్ సింగ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. చాలామంది స్టార్స్ త‌మ పాస్ పోర్ట్‌ల‌ను ర‌ద్దు చేసుకోవాడినికి ఇష్ట‌ప‌డ‌రు. అలాంటిది దీపిక ఓటు కోసం త‌న పాస్‌పోర్ట్‌ను ర‌ద్దు చేసుకుని మ‌రి ఓటు వేయ‌డంపై అంద‌రు ఆమెను అభినందిస్తున్నారు. గ‌తేడాది బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపిక‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -