Sunday, May 5, 2024
- Advertisement -

పూరి జగన్.. లక్ష రూపాయలతోనే ఆ కథ కొనేశాడా!

- Advertisement -

మెగాస్టార్ తో చేయబోయే  150 సినిమాకు సంబంధించిన కథ వివాదంలో పూరి పేరు కొంత నానింది. ఈ కథ నుఒక ఔత్సాహిక రచయిత దగ్గర నుంచి కొట్టేశాడని.. అతడి కాన్సెప్ట్ పూరి చెవిన పడటంతో వీరు దాన్నే మెగాస్టార్ కు చెప్పి సినిమాగా రూపొందించే పనిలో పడ్డారని వార్తలు వచ్చాయి.

అయితే ఆ రూమర్లను పూరి అండ్ బ్యాచ్ ఖండించారు. మరి ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు ‘జ్యోతిలక్ష్మి’ సినిమాకు సంబందించి ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది.

ఈ సినిమాను మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ‘మిసెస్ పరాంకుశం’ ఆధారంగా రూపొందిస్తున్నానని పూరి ఇది వరకే ప్రకటించాడు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల కింద వచ్చిన ఆ నవల ఆధారంగా పూరి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అప్పట్లోనే మల్లాది బోల్డ్ గా రచించిన నవలను పూరి సినిమాగా తీస్తున్నాడు. 

మరి ఈ కథ రైట్స్ విలువ ఎంత? అనే అంశం గురించి టాలీవుడ్ లో జరుగుతున్న చర్చలో ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. కేవలం లక్ష రూపాయల మొత్తాన్ని ఖర్చు పెట్టి మల్లాది నుంచి పూరి ఈ కథ రైట్స్ ను పొందాడట. ఎప్పుడో రచించిన నవల కాబట్టి.. మల్లాది కూడా తక్కువ ధరకే దాని హక్కులను అమ్మేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ రకంగా చూస్తే.. పూరి చాలా తక్కువ ధరకే కథను సొంతం చేసుకొన్నట్టు. మరి ఈ కథ సినిమాగా ఎంత విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -