దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఈగ. 2012లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. కంటెంట్ బలంగా ఉంటే స్టార్ హీరో అవసరం లేదని నిరూపించిన సినిమా ఇది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండగా తాజాగా రాజమౌళి ఈగ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని రాజమౌళి–వారణాసి ప్రాజెక్ట్ అధికారిక హ్యాండిల్ ద్వారా 2026లో ఈ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రీ-రిలీజ్ భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా జరగనుంది.
బాహుబలికి ముందే ప్రపంచ ప్రేక్షకులకు రాజమౌళిని పరిచయం చేసిన సినిమా ఈగ. కథ ఆలోచన, అమలు విధానం, విజువల్ ఇమాజినేషన్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. వచ్చే ఏడాది రీ-రిలీజ్‌తో ఈ సినిమాకు మరోసారి గ్లోబల్ గుర్తింపు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది రాజమౌళి తదుపరి భారీ ప్రాజెక్ట్ వారణాసికి ముందే మంచి హైప్, విజిబిలిటీ తీసుకొస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
నాని, సమంత, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రాసంగికంగానే ఉందని అభిమానులు అంటున్నారు. రీ-రిలీజ్‌కు సంబంధించిన అధికారిక వివరాలు సరైన సమయంలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం రాజమౌళి… మహేశ్ బాబు హీరోగా వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
