భారత్‌లో అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ప్రచారం పొందిన చిత్రాల్లో ఒకటి వార్ 2. హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు.
థియేటర్లలో ఘోర వైఫల్యం తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది వార్ 2. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రంకు ఓటీటీలో మంచి స్పందన వచ్చింంది. అక్టోబర్ 6 నుండి 12 తేదీల మధ్య భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన OTT టైటిల్‌గా నిలిచిందని ఆర్మ్యాక్స్ నివేదిక తెలిపింది. డిజిటల్ రిలీజ్ తర్వాత కొన్ని రోజుల్లోనే 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఇక సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ (హిందీ) కూడా వార్ 2 స్ట్రీమింగ్ రికార్డును అధిగమించలేకపోయింది. రెండు సినిమాలు ఆగస్టు 14న విడుదలైనప్పటికీ, వార్ 2 విజయానికి అసలు కారణం కంటెంట్ కాదని, ఆసక్తి మరియు కుతూహలం (FOMO) అని విశ్లేషకులు చెబుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్గా నటించగా, అనిల్ కపూర్, అశుతోష్ రాణా, వరుణ్ బడోలా కీలక పాత్రల్లో నటించారు. అద్భుతమైన విజువల్స్, స్టార్ స్టడెడ్ లైన్అప్ ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం మరియు భావోద్వేగాల లోపం వల్ల ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది.
