Sunday, May 5, 2024
- Advertisement -

జై సింహాకు ఏమా రేట్లు

- Advertisement -
  • భారీ రేట్లు పెంచార‌ని సినీ ప‌రిశ్ర‌మ‌లో టాక్‌

సంక్రాంతి బ‌రిలోకి మ‌ళ్లీ నంద‌మూరి బాల‌కృష్ణ రానున్నాడు. ఆ స‌మయానికి అనుగుణంగా చిత్రీక‌ర‌ణ ప‌నులు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌వుతున్నాయి. అయితే ఈ సినిమాపై చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేద్దామ‌నుకునే వాళ్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని వినిపిస్తున్న మాట‌.ఈ సినిమాను సి.కల్యాణ్ త‌న బ్యాన‌ర్‌ సీకే ఎంటర్ టైన్ మెంట్స్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. సంక్రాంతి పండుకు సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు చూపిస్తున్నాడట కల్యాణ్. ఈ సినిమాకు ఊహించని రేట్లు చెప్పి వారిని బెంబేలెత్తిస్తున్నాడు. బాల‌య్య రేటుకు మించి అడుగుతుండ‌డంతో ఇది వారికి మింగుడు ప‌డ‌ని విష‌యం.

బాలయ్య మార్కెట్ అంతో ఇంతో. అందుకే పెద్ద సినిమాలు విడుద‌ల అవుతుంటే వాటి మ‌ధ్య బాల‌య్య సినిమా వ‌చ్చి చేరుతుంది. ఈయ‌న రావ‌డంతో సినిమా సినిమాకు మ‌ధ్య పోటీ పెరుగుతుంది. సినిమా ఎలా ఆడుతుంద‌నే విష‌యం ప‌క్క‌న పెట్టాలి. కానీ పోటీని పెంచేసి త‌న సినిమాను న‌డిపించుకుపోతాడు. హిట్ట‌యితే ఆడుతుంది. కాక‌పోతే ఈ కాంపిటీష‌న్‌లో వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌తో స‌ర్దుకుపోవాల్సిందే. ఈ విధంగా సినిమాలు ఉంటుంటే కల్యాణ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా రేట్లు భారీగా ఫిక్స్ చేశాడట. ఓవర్సీస్ తో పాటు ఒకట్రెండ్ ఏరియాలు మినహాయించి మిగతా అన్ని ఏరియాల రైట్స్ ను దాదాపు 40 శాతం పెంచేశాడని టాక్‌. ఇంత భారీగా పెంచితే ఎలా అని? బాలయ్య సినిమాల‌కు అంత ఖ‌ర్చు చేయ‌డం వేస్ట‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు పేర్కొంటున్నాడు. బాలయ్య సినిమాలు ఆడితే కలెక్షన్లు బాగానే వస్తాయి. ఉత్తరాంధ్ర, వెస్ట్ లాంటి ఏరియాల్లో తనే సినిమాను సొంతగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు సి.కల్యాణ్. మిగతా ఏరియాల విషయంలో మాత్రం భారీ రేట్లు చెబుతున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -