Sunday, May 19, 2024
- Advertisement -

ఆ పని చేసినందుకు.. అంజలిని చితక్కొట్టారు

- Advertisement -
Heroine anjali childhood days

తెలుగు అమ్మాయి అయినప్పటికి తమిళంలో సక్సెస్ అయ్యింది అంజలి. ఆ తర్వాత  తెలుగులో రిలీజ్ అయిన జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తూర్పు గోదావరి జిల్లా లో పుట్టి పెరిగిన ఈ భామకి కోలీవుడ్ కలిసొచ్చింది. అలా అక్కడా హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.

తెలుగులో సినిమాలు చేస్తున్నప్పటికి.. అంజలిని.. తమిళ్ అమ్మాయే అనుకుంటారు. తమిళ సినిమాల ద్వారా తెలుగులోకి రావడం వల్ల అలా అనుకుంటున్నారు. అయితే తాజాగా తన చిన్నప్పటి సంగతులను గుర్తు చేసుకుంది. సినిమా చూడటానికి వెళ్తే.. తనకు మంచి సనానం చేసినట్లు చెప్పింది. అమ్మాయి కాలేజ్ ఎగ్గొట్టి సినిమా చూడటానికి వెళ్ళటం అంటే ఇప్పుడంటే పెద్దగా పట్టించుకోరు. గానీ ఓ దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం అంటే అలా ఉండేది కాదు. అప్పటి అనుభవాన్ని అంజలి తన మాటల్లో తెలుసుకుందాం… ‘‘టెన్త్ క్లాస్‌ బాగా చదివేప్పటికి నా కళ్లు నెత్తిమీదకు వచ్చాయి.

అంటే మా బ్యాచ్‌లో నేను ఫస్ట్‌ క్లాస్‌ అన్నమాట. అప్పట్లో బాగా చదివేదాన్ని. దానికి మించిన అల్లరి కూడా చేసేదాని. హైస్కూల్ వరకు నేను ఎప్పుడు బంక్ కొట్టలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కళ్లు నెత్తికెక్కాయి. ఆ రోజుల్లో “నువ్వే కావాలి” మూవీ రిలీజ్ అయ్యింది. యూత్ లో ఆ సినిమాకి మంచి క్రేజ్ వచ్చేసింది. దాంతో దాన్ని ఎలాగైనా చూడాలని, ఒక రోజు కాలేజీకి బంక్ కొట్టి, కొంచెం ఎక్కువ దూరంలో ఉన్న సినిమా హాల్ కు ఎవరూ చూడరనే ధైర్యంతో ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాను. నేను ఇంటికి వచ్చే లోపలే ఆ న్యూస్ బయటకు రావడంతో.. మావాళ్ళు నన్ను చితక్కొట్టేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కాలేజీకి బంక్ కొట్టలేదని.. ఆ రోజులు గుర్తొస్తే ఎంతో బాగా అనిపిస్తోంది అని చెప్పింది.

Related

  1. అంజలి పెళ్లి ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?
  2. రాజ్ తరుణ్ ని అంజలి వాడుకుంది అందుకేనా..?
  3. కుర్ర హీరోతో ఎఫైర్ పెట్టుకున్న అంజలి!
  4. యంగ్ హీరో తో ప్రేమలో ఉన్న అంజలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -