- Advertisement -

మధ్యాహ్న నిద్ర దూరం కావాలంటే….

- Advertisement -

మధ్యాహ్న సమయంలో ఒక కునుకు మంచిదే అయినా దాని వలన కొన్ని దుష్ప్రభావాలు పొంచి ఉంటాయన్న సంగతి తెలిసిందే.

మధ్యాహ్న నిద్ర తర్వాత బద్దకంగా ఉండటం, ఏ పని చేయలేకపోవటం,కొన్ని సార్లు ఒత్తిడి,ఆందోళనకు గురి కావటం జరుగుతాయని నిపుణులు అంటున్నారు.

ఇటువంటి పరిణామాలను తప్పించుకోవాలంటే ఏరోబిక్ వ్యాయామాలు చేయాలనీ నిపుణులు అంటున్నారు. ఈ విషయం మీద 17 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న యువతులపై జరిపిన పరిశోదనలో కొన్ని విషయాలు తెలిసాయి. రోజు అంతా కష్టపడి పని చేసినప్పుడు రాత్రి సమయంలో మంచి నిద్ర ఎలా వస్తుందో, అలాగే రోజులో

రెండు మూడు సార్లు ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే మధ్యాహ్న నిద్ర దరి చేరదని తెలిసింది.

పగటి నిద్ర దూరం అయితే రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడపవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాక పగటి సమయంలో నిద్ర పోకపోవటం వలన రాత్రి సమయంలో గాడ నిద్ర పడుతుంది. అలాగే పగటి పూట ఏరోబిక్ వ్యాయామాలు చేయాలని అనుకొనే వారు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -