Saturday, May 4, 2024
- Advertisement -

సైరాకు శాపంగా మారిన తెలంగాణా ఎన్నిక‌లు..?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘సై రా నరసింహారెడ్డి’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా కర్నాటకలో విడుదల కాదేమోనని మేకర్స్ ఆందోళన చెందుతుంటే ఇప్పుడు సై రాకి మరో సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం చిరు అండ్ టీమ్ జార్జియాకి వెళ్లారు.

ఈ ఒక్క షెడ్యూల్ కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ నెలాఖరు వరకు షూటింగ్ జరగనుంది. అయితే జార్జియా నుండి తిరిగి వచ్చిన తరువాత చిరు ‘సై రా’ పనులపై కాకుండా రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకు కార‌ణం తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌లు. ఎన్నికల సమయానికి మళ్లీ కాంగ్రెస్‌లో జోష్ నింపేందుకు చిరంజీవిని స్టార్ క్యాంపెయినర్‌గా ఉండాలిని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణకు స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. మరి ఆస్థాయిలో కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్న చిరంజీవి మాత్రమే కాంగ్రెస్ అధిష్టానానికి కనిపిస్తున్నారు.

నవంబర్ నెలాఖరున జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీలో చిరంజీవికి కీలక స్థానం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారట. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ఓటర్లను ప్రభావితం చేయాలి అంటే చిరంజీవి అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల సూచనతో ఏకీభవించిన రాహుల్.. చిరంజీవిని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందుకు కారణం తెలంగాణలో ఎన్నికలను కాంగ్రెస్, రాహుల్ గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఉన్న అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోంది.చిరంజీవి ఎలాగైనా ప్రచారం చేసేలా చూడాలని తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -