Wednesday, May 15, 2024
- Advertisement -

కమల్ ఆ సంచలన కథాంశంతో వస్తున్నాడా?!

- Advertisement -

ఒకవైపు ‘ఉత్తమ విలన్’ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఇంకో సినిమా’విశ్వరూపం-2′ కూడా త్వరలోనే విడుదల కానుంది.

ఇక మళయాళ ‘దృశ్యం’ సినిమాను తమిళంలో రీమేక్ చేసేశాడు కమల్. ఇంతలోనే కమల్ మరో ప్రాజెక్టు గురించి కూడా ప్రకటించాడు. ఆ సినిమా కథాంశాన్ని కూడా వివరించాడు. 1968లో తమిళనాడులోని కిళవెన్ మణి అనే గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్టుగా కమల్ ప్రకటించాడు.

ఇంతకీ ఏమా సంఘటన అంటే.. ఆ ఊర్లో ఒక భూస్వామి ఏకంగా 44 మంది దళితులను ఊచకోత కోయించాడు. అగ్రకుల దురహాంకారంతో ఆ కిరాతకానికి పాల్పడ్డాడు. అలాంటి సంఘటన పూర్వపరాల ఆధారంగా కమల్ సినిమా చేయబోతున్నాడట. దీని పేరు ‘ఉళ్లేన్ అయ్యా’ తెలుగులో చెప్పాలంటే ‘ఉన్నాను అయ్యా..’ . ఈ సినిమా గురించి కమల్ చెబుతూ.. దీని విడుదలకు చాలా మంది అడ్డుపడవచ్చని క మల్ అన్నాడు. ఆ సినిమా విడుదలయ్యేలోగా తనను అరెస్టు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కమల్ అభిప్రాయపడ్డాడు.
మరి సంచలన సినిమాలు కమల్ కు కొత్త కాదు. గ్రామీణ సంప్రదాయాలపై.. గ్రామాల్లోని పరిస్థితులపై కూడా రియాలిస్టిక్ సినిమాలు ఘనత కమల్ ది. మరి ఇలాంటి నేపథ్య మున్న నటుడు  ఈ కథాంశం గురించి చెప్పడమే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా విడుదల అయితే ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -