- Advertisement -
బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను వారు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. మా ఆనందపు చిన్నారి వచ్చేశాడు. అపారమైన ప్రేమతో, కృతజ్ఞతతో మా బేబీ బాయ్‌ను స్వాగతిస్తున్నాం అని రాశారు.
నవంబర్ 7, 2025 తేదీతో చేసిన ఈ ప్రకటన క్షణాల్లో వైరల్ గా మారింది. రాకుల్ ప్రీత్ సింగ్, అనిత హసనందాని, ప్రగ్యా జైస్వాల్, వసన్ బాలా తదితరులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
2021 డిసెంబరులో వివాహం చేసుకున్న తర్వాత ఇది వారి తొలి సంతానం. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
