మాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మానస రాధాకృష్ణన్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ అమ్మడు ఇప్పటి వరకు తెలుగు మూవీస్ లో నటించలేదు. ప్రస్తుతం మాలీవుడ్ నుంచి హీరోయిన్లు వరుసగా తెలుగు ఇండస్ట్రీ బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లుగా ఫిలిమ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న ‘పవన్ 28’ సినిమాలో మానస రాధాకృష్ణన్ నటించబోతుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం జరగడంతో స్వయంగా ఆమె స్పందించింది. నాకు పవన్ కల్యాణ్ గారు అంటే చాలా ఇష్టం .. కానీ ఆయన సినిమాలో నేను చేయడం లేదు అని ఆమె క్లారిటీ ఇచ్చింది.
దాంతో మానస రాధాకృష్ణన్ నుంచి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏ విషయమైనా తామే అధికారికంగా వెల్లడిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ వారు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి ‘సంచారి’ లేదా ‘స్టేట్‌కి ఒక్కడే’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
