Friday, April 26, 2024
- Advertisement -

ఏపీలో పరీక్షలు ఉంటాయా? ఉండవా? మంత్రి క్లారిటీ..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్​లో టెన్త్​, ఇంటర్మీడియట్​ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దుచేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం సీబీఐటీ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్​ చేసింది. ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం అంటున్నది.ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం.. పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘ ఏపీలో పరీక్షలు నిర్వహిస్తాం. కానీ కరోనా కేసులు తగ్గాక, పరిస్థితులు అనుకూలించాకే పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షలు రద్దు చేయడం నిమిషం పని. కానీ విద్యార్థుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నాం.

Also Read: థర్డ్​వేవ్​.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్​ఫుల్​..!

ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకు కారణం కరోనా తీవ్రంగా ఉంది. విద్యార్థుల ఆరోగ్యం కూడా మాకు ముఖ్యమే. కరోనా కేసులు తగ్గాక.. విద్యార్థులకు ఏ ఇబ్బందులు లేవని తెలిసినప్పుడే పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకోసం నిపుణులతోనూ చర్చలు జరుపుతున్నాం.

ప్రతిపక్షాలు, ప్రైవేటు యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కొత్తగా అడ్మిషన్లు తీసుకొనేందుకు అనుమతి లేదు. ఏ ప్రైవేట్​ కళాశాల అయినా నిబంధనలకు విరుద్దంగా గనక అడ్మిషన్లు తీసుకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అందరికీ లోకేశ్​ లాగా.. అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకొనేందుకు అవకాశం ఉండదు. పేద విద్యార్థులకు భవిష్యత్​ ఎంతో ముఖ్యం. నేను ఓ తండ్రిగా అయితే పరీక్షల నిర్వహించాలని కోరతాను. అదే సమయంలో విద్యార్థుల ఆరోగ్యం కూడా ముఖ్యమే’ అంటూ పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్​.

Also Read: కళ్లను మాయ చేసే వీడియో.. ఆకు సీతాకొక చిలుకై ఎగిరిపోయింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -