హీరో మంచు విష్ణు శుక్రవారం లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మంచు విష్ణు జగన్‌ను కలవడం చర్చనీయాంశమైంది. విష్ణు, జగన్‌కు దగ్గర బంధువు అవుతాడు. విష్ణు భార్య వెరోనికా జగన్ వల్ల బాబయ్ కూతురు. ఈ బంధంతోనే విష్ణు జగన్‌ను కలిశారని చాలామంది అంటున్నారు. కాని చిత్తూరు జిల్లా నుంచి మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నారని సమాచారం. దీని గురించి మాట్లాడటానికే మంచు విష్ణు ,జగన్ వద్దకు వచ్చారని తెలుస్తోంది.
మంచు ఫ్యామిలీ గతంలో టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ ఫ్యామిలీతో బంధుత్వం పెట్టుకున్న తరువాత నుంచి వారు టీడీపీ దూరంగా ఉంటు వస్తున్నారు. గత కొంతకాలం నుంచి మంచు ఫ్యామిలీ వైసీపీలో చేరడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణు జగన్‌ను కలవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా మోహన్ బాబు,విష్ణు వెళ్లి కలిసి వచ్చారు. ఇప్పుడు కూడా విష్ణు కాజ్యువల్ గా కలిసి ఉండొచ్చనే వాదనలు కూడా వినపడుతున్నాయి.
- Advertisement -
వైసీపీ టికెట్ కోసం జగన్‌ను కలిసిన మంచు విష్ణు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
