1.అమెరికాలో బాహుబలి భారీ సందడి చేయనుంది.5వేల థియేటర్లలో సినిఆమ విడుదల కాబోతోంది.తెలుగు భాషలోనే ఏకంగా 130 స్క్రీన్స్ లో ఈ మూవీని ప్రదర్శిస్తున్నారు.
2. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పూరి రూపొందించబోయె లోఫర్ మూవీ….ఈనెల 9 నుంచి మూడు రోజుల పాటు షూట్ జరుపుకోబోతోంది.
ఆతరువాత రెండవ షెడ్యూల్ ….ఈనెల 20 నుంచి జోద్ పూర్ తలో వచ్చే నెల 20 వరకు కంటిన్యూగా జరుపుకుంటుంది.లోఫర్ లో వరుణ్ సరసన దిశా పతాని హీరోయిన్ గా చేసే అవకాశాలున్నాయి.
3. రెజీనా రైజింగ్ మీదున్న విషయాన్ని మరో సారి గుర్తు చేస్తుంది.యాక్షన్ హీరో గోపీచంద్ చిత్రంలో రెజీనా కన్ఫామ్ అయింది.ఈ సినిమా భవ్యక్రియేషన్స్ పతాకంపై కెయస్ రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతుంది.దీనిలో రెజీనాకు మాంచి మసాలా పాత్ర లభించినట్లు తెలుస్తోంది
4. కేరళ కుట్టి అసిన్ వరుస బ్రేకప్ లతో హల్చల్ చేస్తోంది.నీల్ నితిన్ ముఖేష్ కు రామ్ రామ్ చెప్పిన ….ఈచిన్నది ఇపుడు మైక్రోమాక్స్ అధినేత రకుల్ శర్మతో కూడా బ్రేకప్ అయిపోయింది.ఆల్మోస్ట్ వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారంటూ మొన్నామధ్య బిటౌన్ వరుస కథనాలను ప్రచురించింది.
5. పూరి పోరి ఛార్మి….మంత్ర 2 సినిమా తెలుగులోనే కాకుండా కోలీవుడ్లోను రిలీజ్ కు నోచుకుంటుంది.తమిళంలో ఈమధ్యకాలంలో హారర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో చార్మి చేసిన మంత్ర 2 ను అక్కడ రిలీజ్ చేస్తున్నారు.
6.నేడు విడుదలైన బస్తీ,సూపర్ స్టార్ కిడ్నాప్ లకు మంచి టాక్ వచ్చింది. కొత్త తరహా కథలతో వచ్చిన బస్తీ,సూపర్ స్టార్ కిడ్నాప్ మూవీలు
యూత్ ను నచ్ఏ ఎలిమెంట్స్ తెరకెక్కి మొదటిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
7.నాగార్జున,కార్తి కాంబినేషన్లో పివిపి సినిమా రూపొందిస్తోన్న మల్టీస్టారర్ సినిమా త్వరలో ఫారన్ షెడ్యూల్ షూట్ కు రెడీ అవుతోంది.కొన్ని కారణాల వలన ఆగిపోయిందని చెప్పిన ఈచిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని యాక్షన్ పార్ట్ కోసం విదేశీ ట్రిప్ ను ప్లాన్ చేస్తున్నారు.
