ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తీసిన కథా నాయకుడు సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా చూడడానికి చిత్రబృందం హైదరాబాద్ లో భ్రమరాంబ థియేటర్‌కి తరలివచ్చారు. హీరో బాలకృష్ణతో పాటు చిత్ర దర్శకుడు క్రిష్ కూడా ఈ సినిమాను భ్రమరాంబ థియేటర్‌కి వచ్చారు. అభిమానుల కోలాహలం మధ్య సినిమా చూశారు బాలయ్య. ఇక హరికృష్ణ కూతురు సుహాసిని కూడా ఎన్టీఆర్ బయోపిక్ చూశారు.
ఈ సినిమా చూసిన సుహాసిని బాలయ్యపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. బాలయ్య బాబాయ్ తాతగారిలా అద్భుతంగా నటించారని, మాకు తెలియని విషయాలను ఈ సినిమా ద్వారా తెలియజేశారని చెప్పుకొచ్చింది సుహాసిని. సినిమా చాలా బాగుందని , సంక్రాంతికి బాలయ్య బాబాయ్‌కు మరో హిట్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది సుహాసిని. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సుహాసిని టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నియోజిక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
- పాండ్యాతో డేటింగ్ ప్రచారంపై అమీషా పటేల్ ఏమన్నారంటే..?
- బిగ్‌బాస్ సీజన్-10 ప్రారంభం
- అశ్లీల పరిశ్రమను చట్టబద్ధం చేయాలని ఉక్రెయిన్ యోచన!
