ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ మరియు భారత క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన నేపథ్యంలో, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పలాష్..ఓ మహిళతో చేసిన చాట్ బయటకు రావడంతో వీరిద్దరి వివాహనికి బ్రేక్ పడినట్లేనని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ జంట ఇప్పటివరకు ఈ ప్రకటనలపై స్పందించలేదు.
ఈ నేపథ్యంలో పలాష్ బంధువు నీథి టక్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అన్నను సమర్థిస్తూ ఒక నోట్ రాశారు. ప్రస్తుతం పలాష్ కూడా ముంబై ఆసుపత్రిలో ఉన్నారు అని చెప్పారు. పలాష్ ఇవాళ చాలా కీలక పరిస్థితిలో ఉన్నాడు. నిజం తెలియకుండానే అతన్ని తప్పుగా నిర్ణయించకండి. నేటి సాంకేతికత మనుషులకంటే ముందుకెళ్లింది… అందుకే రూమర్లను చూసి పలాష్‌ను తీర్పు చేయకండి. అతని కోసం ప్రార్థించండి అని చెప్పుకొచ్చారు నీథి. .”
వాస్తవానికి పలాష్ మరియు స్మృతి వివాహం నవంబర్ 23, ఆదివారం జరగాల్సి ఉండగా స్మృతి తండ్రి అస్వస్థత కారణంగా వేడుక వాయిదా పడింది. ప్రస్తుతం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు సమాచారం. ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో స్మృతి తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో త్వరగా ఆసుపత్రికి తరలించారని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా మీడియాకు తెలిపారు.
