సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. హిట్‌లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు రజినీ. కబాలి, కాలా, రోబో 2.0 ఇలా వరుస పెట్టి సినిమాలు చేసిన రజినీ, మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం పేటా. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తమిళ భాషలో విడుదల కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగులో కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్.ఇరవై మందిని పంపించాను.. చితక్కొట్టి తరిమాడు అంటూ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ లో ‘వాడు కూర్చునే తీరుని బట్టే పసిగట్టగలం.. వాడు భయపడేవాడా..? కాదా..? అని.. వాడు మామూలోడు కాదు’ అంటూ రజినీకాంత్ క్యారెక్టర్ గురించే చెప్పే ప్రయత్నం చేశారు.
త్వరలోనే చూస్తావురా ఈ కాళీ ఆడించే ఆట అంటూ రజినీ కాంత్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది.ఈ సినిమాలో రజినీ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. త్రిష, సిమ్రాన్ హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాను కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఇక పేటాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు.
- దిగొచ్చిన దీదీ..కూటమి సమావేశానికి!
- 30 ఏళ్లకే గుండెపోటు..కారణాలు & జాగ్రత్తలు!
- విజయ్ స్థానంలో లారెన్స్..పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
- కోహ్లీపై వైభవ్ షాకింగ్..వీడియో!
- వైసీపీ నేతలే టార్గెట్‌గా అక్రమకేసులు!
