Saturday, May 4, 2024
- Advertisement -

అరెస్ట్ అయిన ఉయ్యాలవాడ కుటుంబీకులు

- Advertisement -

చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమాపై అంచనాలతో పాటు రోజు రోజుకి వివాదాలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులు కొణిదెల సంస్థ బయోపిక్ కోసం గౌరవ వేతనం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 10 ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని కొణిదల ప్రొడక్షన్స్‌ కార్యాలయం ఎదుట ధర్నా కి దిగారు. తమకు న్యాయం చేయాలని, ఇస్తామన్న పారితోషకాన్ని ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీంతో పరిస్థితి చేయి దాటకముందే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలు జిల్లా లో ఉయ్యాలవాడ గ్రామంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 5వ తరం వారసులు మాట్లాడుతూ. సినిమా మొదలవక ముందు కొణిదెల ప్రొడక్షన్స్ వారు తమకు గౌరవ వేతనం ఇస్తామన్నారని, మే లో రాంచరణ్‌ పీఏ అవినాష్‌ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కు పిలిపించి వారసులైన 22 మందికి రూ. 5 కోట్లు ఇప్పిస్తామంటూ నోటరీ అగ్రిమెంట్‌ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో 15 రోజుల గడువు ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదని వారి ఆరోపణ. గత నెల 16న 7 కుటుంబలకి రూ.15 లక్షల చొప్పున ఇస్తామన్నారు కానీ సినిమా విడుదలకి వచ్చేసింది కానీ ఇస్తామన్న వేతనం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -