- Advertisement -

రామాయణం..రీవిల్ చేసిన యష్!

- Advertisement -

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’ (Ramayana) చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికాలోని లాస్ వేగాస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక సినిమాకాన్ 2026 (CinemaCon 2026) వేదికపై ఈ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించి, ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించారు.

ఈ వేదికపై నటుడు మరియు సహ నిర్మాత యష్ (Yash), నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి పాల్గొని సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో రావణుడిగా నటిస్తున్న యష్ మరియు రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ (Ranbir Kapoor) మధ్య మొదటి భాగంలో ఎలాంటి కాంబినేషన్ సీన్లు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

రావణుడికి తన సొంత సామ్రాజ్యం (లంక) ఉంది, రాముడికి తన సొంత రాజ్యం ఉంది. ఇది రెండు భాగాల సినిమా అని మీ అందరికీ తెలుసు. అందుకే పార్ట్-1లో మా ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్లు లేవు అని యష్ వివరించారు. రణబీర్ కపూర్ ఒక అద్భుతమైన నటుడని యష్ ఈ సందర్భంగా కొనియాడారు.

యష్ ఇచ్చిన క్లారిటీ ప్రకారం.. రాముడు-రావణుల మధ్య జరిగే మహా సంగ్రామం మరియు ముఖాముఖి సన్నివేశాలు రెండవ భాగం (Part 2) కోసం రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విజువల్ వండర్‌లో సీతగా: సాయి పల్లవి…ఇతర కీలక పాత్రల్లో: సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్, రవి దూబే నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -