- Advertisement -

వైష్ణవి హత్య కేసు..ఐసీయూలో హరిబాబు!

- Advertisement -

జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన యూట్యూబర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించారు.

జైలు అధికారులు వెంటనే స్పందించి హరిబాబును జగిత్యాల ఆసుపత్రి కి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించి, ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి పరిశీలిస్తున్నారు.

హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. వైద్యులు ఆయన పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కేసు చుట్టూ మరోసారి చర్చలు మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో హరిబాబు రిమాండ్‌లో ఉండగా ఈ ఘటన జరగడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -