- Advertisement -
అనంతపురంలో హనీ ట్రాప్ కలకలం రేపింది. మహిళలను ఎరగా వేసి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు కేటుగాళ్లు. రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసింది ముఠా.
ఓ జ్యోతిష్యుడి నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేయగా హనీ ట్రాప్ ముఠాకు సహకరిస్తున్నారు ఓ పోలీసు అధికారి.అలాగే ఓ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.
పని ఉందంటూ మహిళను పంపి.. ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలో దాడి చేస్తున్నారు ముఠా సభ్యులు. డబ్బు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతామంటూ బెదిరింపులు… కాదని మొండికేస్తే పోలీసుల ద్వారా పంచాయితీ చేస్తున్నారు.
అనంతపురం ఎస్పీ జగదీష్ కు బాధితులు ఫిర్యాదు చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి హనీ ట్రాప్ ఆడియో టేపులు.
