- Advertisement -

మొయినాబాద్ డ్రగ్స్ కేసు..రిమాండ్ రిపోర్ట్‌

- Advertisement -

హైదరాబాద్ మొయినాబాద్‌లో బయటపడిన డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

పోలీసుల వివరాల ప్రకారం, ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని సమాచారం అందడంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. అయితే పోలీసులు లోపలికి ప్రవేశించగానే ఒక్కసారిగా బుల్లెట్ శబ్దాలు వినిపించాయి. పోలీసులు తమను తాము గుర్తు చేసి “పోలీసులం” అని పలుమార్లు చెప్పినా వినకుండా నిందితులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

పోలీసులపై కాల్పులు జరపడం వెనుక ఉద్దేశ్యం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడమేనని అధికారులు భావిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఉపయోగించిన తుపాకి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్‌కు చెందిన లైసెన్స్డ్ గన్‌గా గుర్తించారు. కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు నమిత్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక ఈ కేసులో డ్రగ్స్ సరఫరా వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. సిమ్లా నుంచి కౌశిక్ రవి అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు విచారణలో తెలిసింది. గ్రాముకు సుమారు రూ.15 వేల చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పార్టీ సమయంలో కొకైన్‌ను మద్యంలో కలిపి తీసుకున్నట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం.

పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ టెస్టుల్లో మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విడివిడిగా విచారించారు. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -