- Advertisement -

గురుకుల హాస్టల్‌లో క్షుద్ర పూజల కలకలం

- Advertisement -

జనగామ జిల్లాలో గురుకుల హాస్టల్‌లో క్షుద్ర పూజల ఆరోపణలతో కలకలం రేగింది. .జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గిరిజన బాలికల వసతి గృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారని, విద్యార్థినులకు సరైన భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

ఇటీవల కలుషిత ఆహారం వడ్డిస్తున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో తరగతులను బహిష్కరించి రోడ్డెక్కారు. హాస్టల్ ప్రాంగణం వద్ద మరియు ప్రధాన రహదారిపై నిరసన చేపట్టి నినాదాలు చేశారు. “మంచి ఆహారం ఇవ్వాలి”, “కనీస వసతులు కల్పించాలి”, “ప్రిన్సిపాల్ డౌన్ డౌన్” అంటూ విద్యార్థినులు ఆందోళన కొనసాగించారు.

ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న అధికారులు హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడినట్లు తెలిసింది. ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది రోజులకే క్షుద్ర పూజలు జరగడం కలకలం రేపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -