Sunday, May 5, 2024
- Advertisement -

గన్నవరం..టీడీపీకి భంగపాటే?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న నియోజకవర్గం గన్నవరం. వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీని ఓడగొట్టేందుకు టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. ఈసారి కూడా విజయం వల్లభనేని వంశీదే కానుంది. స్థానికంగా వంశీకి గట్టి పట్టు ఉండగా దీనికి తోడు వైసీపీ బలం చేకూరడంతో ఈసారి కూడా భారీ మెజార్టీతో వంశీ గెలుపు ఖాయం కానుంది.

విచిత్రం ఏంటంటే గత ఎన్నికల్లో టీడీపీ నుండి వంశీ పోటీ చేయగా వైసీపీ నుండి యార్లగడ్డ వెంకట్రావ్ పోటీ చేశారు. అయితే ఈసారి మాత్రం సీన్ రివర్స్. వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్‌, టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్‌ పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో కే 800 ఓట్ల తేడాతో గెలిచిన వంశీ…ఈసారి భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

గన్నవరంలో అత్యధికంగా బీసీలు, ఎస్సీలు ఉన్నారు. వీరంతా వైసీపికి జై కొట్టడం ఖాయమని తెలుస్తోంది. అధికార, ప్రతిపక్షాలు రెండూ అగ్రవర్ణాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లు ఇచ్చినా గన్నవరంలో ఈసారి వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -