చంద్రబాబు, లింగమనేని రమేశ్, నారాయణ, లోకేశ్‌లకు శిక్ష తప్పదని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను కేవలం రూ.8 లక్షలకు విక్రయించారని ఆరోపించారు.
ప్రభుత్వ పదవులను దుర్వినియోగం చేసి భూముల విలువలను కావాలనే తగ్గించి, తనకు అనుకూలమైన వ్యక్తులకు లాభం చేకూర్చారని ఆయన అన్నారు. ముఖ్యంగా రెండున్నర ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్‌కు కేవలం రూ.8 లక్షలకు ఇచ్చారని పేర్కొన్నారు. మార్కెట్ విలువకు సరితూగని ధరలకు భూముల బదిలీ జరిగిందని, ఇది ప్రజా ధనానికి నష్టం కలిగించిందని ఆరోపించారు.
అత్యంత విలువైన కరకట్టపై ఉన్న ఇంటిని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చారని కూడా ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పేరిట కొంతమంది నేతలు వ్యక్తిగత లాభాలు పొందారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అవినీతి ఆరోపణలు రుజువైతే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
