మా వారిపై దాడి జరిగితే తిరిగి మావారిపైనే కేసులు పెట్టారు అని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మీడియాతో మాట్లాడిన రాంబాబు… పులివెందులలో ఎలాగైనా గెలవాలని టీడీపీ దాడులకు దిగుతోంది అన్నారు. ఎన్ని అక్రమాలైనా చేసి తన గ్రాఫ్ పడిపోవడం లేదని చంద్రబాబు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు..పోలీసులు టీడీపీ తరపున రౌడీలుగా పని చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
లక్షల కోట్లు కాజేయాలనే దురుద్దేశంతో సింగపూర్ వెళ్లిన చంద్రబాబు, లోకేష్ లకు అక్కడ గిట్టకపోయేసారికి తెగ బాధపడుతూ, మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు.
అసలు ఏపీకీ సింగపూర్ ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వానికి కాదు, అక్కడున్న కొన్ని సంస్థలు పెట్టుబడి పెట్టడానికి వస్తే సింగపూర్ ప్రభుత్వమే వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పాడు. దీనిపై సింగపూర్ పార్లమెంట్ లో సింగపూర్ ప్రభుత్వం మాకు, ఏపీ ప్రభుత్వానికీ సంబంధం లేదని స్పష్టంగా తెలియజేసింది అని తెలిపారు.
