Saturday, May 4, 2024
- Advertisement -

ఫైబర్‭నెట్ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌..

- Advertisement -

ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అంగీకరించింది న్యాయస్థానం. రూ.114 కోట్లు రూపాయల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేయగా అంగీకరించింది న్యాయస్థానం.

టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ తో మొత్తం ఏడుగురు ఏ7 తుమ్మల ప్రమీల, టేరాసాఫ్ట్ ఎండీ బార్య,ఏ9 తుమ్మల గోపీ చంద్, టేరాసాఫ్ట్ ఎండీ,ఏ11 టెరా సాప్ట్ కంపెనీ,ఏ23 నెట్ టాప్ కంపెనీ ఎండ w కనుమూరి కోటేశ్వరరావు ఆస్తులను అటాచ్‌మెంట్ చేయనుంది ఏసీబీ. కోర్టు ఆదేశాలతో రూ. 114 కోట్లు రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేయనున్నారు. ఇదే కేసులో ఏ25గా ఉన్నారు చంద్రబాబు.

టీడీపీ హయాంలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందని ఫిర్యాదు అందడంతో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. సీఎంగా చంద్రబాబు తన సన్నిహితులకు లాభం చేకూర్చేలా వ్యవహరించారని సీఐడీ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో టెరా సాఫ్ట్‌తో పాటు వేమూరి హరిప్రసాద్‌కు చెందిన ఏడు ఆస్తులను అటాచ్ చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -