- Advertisement -

ఫ్రీ బస్..ఆరోజు నుండే?

- Advertisement -

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి డేట్ ఫిక్స్ అయింది. ఆగష్టు 15న సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీంకు పచ్చజెండా ఊపనునున్నట్లు సమాచారం. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి గైడ్ లైన్స్ అన్ని సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 16న జరిగే ఏపీ కేబినెట్‌ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇక ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ నుండి ఇప్పటికే నివేదికలు కోరింది ప్రభుత్వం. ప్రతిరోజు ఎంతమంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు? ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది?ఆర్టీసీని గట్టెక్కించే చర్యలేంటి అన్నదానిపై చర్చించారు.

ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అమలవుతున్న తీరుపై అధ్యయనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రూట్లలోనూ ఈ పథకం అమలుకానుందని తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అన్న క్యాంటీన్లను సైతం ఆగస్టు 15నే ప్రారంభించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -