మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టింది న్యాయస్థానం. జగన్ ప్రస్తుతం వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం బదులు వేరొక వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అనంతరం విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
వైఎస్ జగన్ కి రిమోట్ కంట్రోల్ ద్వారా హాని జరిగే అవకాశం ఉన్న చోట జామర్ వెహికల్స్ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు.
ఇటీవలె తన భద్రతపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు జగన్. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఎలాంటి సమాచారం లేకుండానే తన భద్రతను తొలగించారన్నారు.
