- Advertisement -

గ్రామాల్లో ఫ్యాన్‌దే జోరు..తిరుగులేని జగన్!

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండగా అప్పుడే జోరు పెంచేశారు సీఎం జగన్. రెండోసారి కూడా తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నాలుగు నెలలు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజల్లోనే ఉండేలా చర్యలు చేపట్టారు. ఇక ప్రజల్లో వైసీపీ స్పందన ఎలా ఉందనే దానిపై సర్వే నిర్వహించగా పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ ఫ్యాన్‌దే జోరని తేలిపోయింది.

జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ది చేకూరుతుండటంతో వారంతా సంతోషంగా ఉన్నారు. ఇక భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మరింత ఓటు బ్యాంకును పెంచుకున్నారు.రైతులు, అసైన్డ్ భూముల వివాదాలకు చెక్ పెట్టేలా జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

వాస్తవానికి అసైన్డ్ భూముల పట్టాలివ్వడం రైతులకు బిగ్ రిలీఫ్ లభించింది.నికి, వ‌రిక‌పూడిశెల ప్రాజెక్టుకు గ‌తంలో ఎలాంటి అనుమ‌తులు తీసుకోకుండానే ముఖ్య‌మంత్రులు శంకుస్థాప‌న‌లు చేశారు. కానీ జగన్ మాత్రం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే రంగంలోకి దిగి శంకుస్థాపన చేయడం స్థానిక ప్రజల్లో మరింత ధైర్యం తెచ్చింది. బ‌డ్జెట్ కూడా కేటాయించ‌డంతో శరవేగంగా ప‌నులు జ‌రుగుతాయ‌ని ప‌ల్నాడు ప్ర‌జ‌లు భావిస్తున్నారు. మొత్తంగా వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు పెరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -