Thursday, May 2, 2024
- Advertisement -

ఎన్నికల వేళ..టీడీపీకి బిగ్ డ్యామేజ్!

- Advertisement -

ఏపీలో పెన్షన్ల పంపిణీ వ్యవహారం ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ డ్యామేజ్ తెచ్చిపెట్టింది. ప్రతినెల 1వ తేదీనే వచ్చే పెన్షన్లకు చంద్రబాబే బ్రేక్ వేశారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇక మరోవైపు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్దం మైంది. ఇందుకు సంబంధించి బీఆర్వో విడుదల చేసింది.

వాస్తవానికి వాలంటీర్ల వ్యవస్థపై తొలి నుండి టీడీపీ విషం చిమ్ముతునే ఉంది. పేదలకు నేరుగా లబ్ది చేకూర్చే అతిపెద్ద డోర్ డెలివరీ సిస్టమే వాలంటీర్ వ్యవస్థ. దీని ద్వారా లబ్దిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందాయి. అయితే ఇది నచ్చని టీడీపీ మొదటి నుండి కుట్రలు చేస్తూనే ఉంది. ఓ వైపు తాము అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామనే చెబుతునే మరో వైపు వారి మెడ మీదనే కత్తి పెట్టి పొలిటికల్ డ్రామాలు ఆడుతోంది.

66 లక్షల కుటుంబాలకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేలు జరుగుతోంది. అయితే ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు ఏకంగా సీఎస్‌కే ఫిర్యాదు చేసింది. దీంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ పడుతుందని భావించారు చంద్రబాబు. కానీ పేద ప్రజల సంక్షేమం కోసం నిత్యం ఆలోచించే జగన్‌…పెన్షన్ల పంపిణీకి సిద్దమైంది.

అయితే పెన్షన్ల పంపిణీని అడ్డుకుంది జగన్‌ అని అబద్దపు ప్రచారం చేయాలని భావించారు చంద్రబాబు అండ్ కో. కానీ ప్రజలకు లబ్దిచేకూరే పెన్షన్ల పంపిణీని బాబే అడ్డుకున్నారని క్షేత్రస్థాయిలో ప్రచారం జరిగిపోవడంతో టీడీపీకి పెద్ద డ్యామేజ్ జరిగిందనే చెప్పుకోవాలి. టీడీపీ తమంత తామే సెల్ఫ్ గోల్ చేసుకుందని ప్రజలే బహిరంగంగా చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముంగిట మండే మే ఎండలలో వృద్ధులు పేదలు రోడ్ల మీద పెన్షన్ కోసం పడిగాపులు గాయించేలా చంద్రబాబు చేశారని మండిపడుతున్నారు. మొత్తంగా ఏపీ పెన్షన్ల వ్యవహారం చంద్రబాబుకు గట్టి షాకనే చెప్పుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -