- Advertisement -

మద్యం బాటిళ్లు..సీసీటీవీ ఫుటేజ్‌ బయటపెట్టాలి!

- Advertisement -

వైసీపీ కార్యకర్తనే మద్యం సీసాలు పెట్టాడని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన భూమన.. గత ఏడాదిన్నర కాలంగా బీఆర్ నాయుడు అనుచరులే తిరుమలలో అరాచకాలకు పాల్పడుతున్నారు అన్నారు.

అక్కడున్న ఖాళీ సీసాలను కోఠి అనే వ్యక్తి వీడియో తీశాడు … పోలీసుల చేత పచ్చి అబద్దాలు చెప్పించి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు అన్నారు. ఎక్కడో ఉన్న సీసీ ఫుటేజ్ కాకుండా దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేయాలి అన్నారు.

తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంకి సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజీని విడుదల చేయాలని డిమాండ్ చేసింది.తిరుమల నిఘా వ్యవస్థ కూడా ఏమైందని భూమన ప్రశ్నించారు. నిఘా వ్యవస్థ నిద్రపోతోండటం వల్లే పవిత్రమైన తిరుమల కొండమీద ఎటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. బీఆర్ నాయుడు నిజంగానే భక్తిపరుడే అయితే మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

మద్యం బాటిళ్లను తీసుకువచ్చి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వైసీపీ సోషల్ మీడియా, సాక్షి ప్రతినిధి అరెస్టయ్యాడని, తిరుమలలో భక్తుల మనోభావాలను గాయపరిచేలా వ్యవహరించారని, టీటీడీ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో భూమన కరుణాకర్ రెడ్డి తన ప్రైవేట్ సైన్యంతో నిత్యం అసత్య ప్రచారాలు చేశాడని బీఆర్ నాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -