- Advertisement -

మూసీ ప్రక్షాళన..రేవంత్‌ సర్కార్‌కు NGTలో ఊరట

- Advertisement -

మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను National Green Tribunal (NGT) కొట్టివేసింది.

మూసీ ప్రక్షాళన పనులను అడ్డుకునేలా దాఖలైన పిటిషన్‌ను NGT పరిశీలించిన అనంతరం తిరస్కరించింది. దీంతో ప్రభుత్వం చేపట్టిన శుద్ధి కార్యక్రమాలకు చట్టపరమైన అడ్డంకులు తొలగినట్లయ్యాయి.

ఈ పిటిషన్‌ను పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేశారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌పై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని కోరారు.

NGT తీర్పుతో మూసీ ప్రక్షాళన పనులకు మార్గం సుగమం అయింది.ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతం లభించింది.

మూసీ నదిని శుద్ధి చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం,నగర పర్యావరణాన్ని మెరుగుపరచడం,నీటి వనరులను సంరక్షించడం.

NGT తీర్పు మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ అమలు వేగవంతం అయ్యే అవకాశం ఉండగా, పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధి మధ్య సమతుల్యతను పాటించడం ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -