- Advertisement -

ఫాస్టాగ్..కాస్త రిలీఫ్!

- Advertisement -

ఫాస్టాగ్ లేని వాహనదారులకు గుడ్ న్యూస్. జాతీయ రహదారులపై ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపుల విషయంలో రెండు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది కేంద్రం. ఫాస్టాగ్‌ లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల వద్ద ఇప్పటివరకు సాధారణ రుసుంకు రెండింతలు చెల్లించాల్సి వచ్చే నిబంధనను సడలించారు. నవంబరు 15 నుంచి అమలులోకి రానుంది ఈ కొత్త నిబంధన.

నవంబర్ 15 నుంచి, మీ వాహనానికి FASTag లేకపోతే, లేదా అది చెల్లని / పనిచేయని FASTag అయితే, మీరు UPI ద్వారా టోల్ చెల్లించే అవకాశం పొందుతారు. ప్రస్తుతం FASTag లేని వాహనదారులు నగదుగా చెల్లిస్తే రెట్టు టోల్ ఫీజు చెల్లించాలి — కాబట్టి ఈ నిర్ణయం పెద్ద ఉపశమనంగా భావించాలి.

ఎందుకంటే ఫాస్టాగ్ లేని వాహనదారులు Unified Payments Interface (UPI) ద్వారా చెల్లిస్తే, ఆ వాహన వర్గానికి సంబంధించిన సాధారణ టోల్ ఫీజుపై కేవలం 1.25 రెట్లు మాత్రమే చెల్లించాలి. ఒక వాహనం సాధారణంగా ₹100 టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటే, FASTag ద్వారా చెల్లిస్తే ₹100
నగదుగా చెల్లిస్తే ₹200 (రెట్టు) కానీ ఇకపై UPI ద్వారా చెల్లిస్తే ₹125 (1.25 రెట్లు) మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

ఈ సవరణ ద్వారా టోల్ వసూళ్ల విధానం బలపడుతుంది, పారదర్శకత పెరుగుతుంది.అలాగే జాతీయ రహదారుల వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుంది. ఈ నిబంధన 2025 నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -