- Advertisement -

పేర్ని నానికి బిగ్ రిలీఫ్

- Advertisement -

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ రిలీఫ్. రేషన్ బియ్యం స్కాంలో పేర్ని నానిని ముందస్తు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్‌లో రేషన్‌ బియ్యం మాయమైందన్న అభియోగాలతో కూటమి ప్రభుత్వం కిందటి ఏడాది డిసెంబర్‌లో కేసు పెట్టింది.

ఈ కేసులో జయసుధ పేరును ఏ1గా, ఏ2గా గోదాం మేనేజర్‌ మానస్ తేజ్, మిల్లు యాజమాని బాల ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ మంగారావులను మిగతా నిందితులుగా చేర్చారు.

ఈ కేసులో పేర్ని జయసుధ విచారణకు హాజరు కాగా ముందస్తు బెయిల్ కూడా లభించింది. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసేనని నాని కామెంట్ చేశారు. కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్‌ రెడ్డికి కూడా ఇవాళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కాకినాడ పోర్టు, సెజ్ కు సంబంధించి 41 శాతం వాటాలు బలవంతంగా లాగేసుకున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయితే కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో తనకు సంబంధం లేదని విక్రాంత్ రెడ్డి చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -