Thursday, May 2, 2024
- Advertisement -

గులాబీ బాస్ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్!

- Advertisement -

మూడోసారి అధికారంలోకి వచ్చి దక్షిణాదిన హ్యాట్రిక్ కొట్టిన తొలి సీఎంగా నిలవాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. అయితే ఓటింగ్‌లో కేవలం 2 శాతం తేడాతోనే ఓడిపోయింది బీఆర్ఎస్. ఇక ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ ప్రతిపక్షంలో కూర్చోంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 రోజులు దాటగా అప్పుడే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం తారాస్ధాయికి చేరింది. ప్రధానంగా శ్వేతపత్రం వర్సెస్ స్వదే పత్రం అంటూ వార్ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలని భావిస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని లోక్ సభ ఎన్నికలతో పూడ్చుకునే విధంగా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలే కాదు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న తొలి ఎంపీ ఎన్నికలు. అందుకే ఇప్పటినుండే క్షేత్రస్ధాయి ప్రణాళికతో ముందుకు వెళ్లేలా గ్రౌండ్ ప్లాన్ ప్రీపేర్ చేస్తున్నారు.

ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ ఉంటుంది కాబట్టి మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 16 సీట్లపై ఫోకస్‌ చేశారు కేసీఆర్.ఇక కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎక్కడి నుంచి బరిలో దిగుతారు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మెదక్ లేదా కరీంనగర్ పేర్లు వినిపిస్తుండగా ఎక్కడి నుండి పోటీ చేస్తారు అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే గులాబీ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు పెద్ద సవాలే. ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఎదురైతే అది బీఆర్ఎస్‌కే నష్టం. అందుకే మెజార్టీ స్థానాలు దక్కించుకునేలా గులాబీ దళపతి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -