ఎట్టకేలకు చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. స్కీల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో 53 రోజులుగా రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాల రిత్యా నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు సరెండర్ కావాలని ఆదేశించింది.
ఇక అనారోగ్య కారణాల రిత్య బెయిల్ మంజూరు చేసింది కాబట్టి షరతులు కూడా విధించింది. రూ.1 లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. సొంత ఖర్చులతో ఏ ఆస్పత్రిలోనైనా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చని, అలాగే చంద్రబాబు వైద్యానికి సంబంధించిన వివరాలను, సీల్డ్ కవర్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్, ట్రయల్ (ఏసీబీ) కోర్టుకు ఇవ్వాలని తెలిపింది.
ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని తెలిపింది. అలాగే ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని…ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని వెల్లడించింది. మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఇవాళ మధ్యాహ్నం నాలుగు గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెడికల్ గ్రౌండ్‍లో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విడుదలకానున్న నేపథ్యంలో మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
