Monday, May 6, 2024
- Advertisement -

జనసేన సీట్ల సంఖ్య..బాబు నిర్ణయమే ఫైనలా?

- Advertisement -

జనసేన నేతలతో పవన్ సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాల వారీగా పోటీ చేసే స్థానాలపై నాయకులతో వన్ టూ వన్ సమీక్ష నిర్వహిస్తున్నారు పవన్. ఇవాళ, రేపు రెండు రోజుల జరిగే సమావేశంలో మరింత మంది నేతలతో సమావేశం కానున్నారు పవన్. దీంతో పవన్ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవలె కాకినాడ జిల్లా కేంద్రంలో 14 నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలతో మూడురోజుల పాటు సమావేశం అయ్యారు పవన్. రాష్ట్రంలో ఏ ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది, పోటీచేస్తే గెలిచే నియోజకవర్గాలు ఏవి, ఎక్కువగా ఓటు బ్యాంకు సాధించే నియోజకవర్గాలేవి అనే దానిపై పూర్తి క్లారిటీకి వచ్చారు పవన్‌. ఓ వైపు సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు జనసేన పోటీ చేసే స్థానాలపై సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు.

నేతలతో వన్ టూ వన్ రివ్యూ మీటింగ్‌లో పోటీ చేయాల్సిన స్థానాలపై పవన్ దాదాపు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా త్వరలోనే జనసేన పోటీచేసే నియోజకవర్గాలపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు పవన్. సంక్రాంతి తర్వాత టీడీపీ – జనసేన రెండు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఇక సీట్ల సంఖ్య, కాస్త అటూ ఇటూ అయినా అడ్జస్ట్ కావాలని నేతలకు ఈ సమావేశాల్లోనే పవన్‌ సూచిస్తుండటం విశేషం.

పోటీ చేసేందుకు నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తుండటంతో పవన్ క్లారిటీకి రాలేకపోతున్నారు.సో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై చంద్రబాబు తేల్చితే తప్ప లెక్క తెలేలా కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -