టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు ప్రజల చేత నవ్వులు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయిన ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే బరిలోకి దించుతుంది. ఎందుకంటే గెలిస్తేనే అధికారంలోకి వచ్చేది. తాజాగా ఇప్పుడు చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ సారి గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయని చెప్పారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన వారికి టికెట్లు ఇచ్చారా అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ అంటూ చంద్రబాబు ప్రకటన చేసినా అందులో గెలిచేది ఎంతమంది అన్నది సందిగ్దమే.పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి. ఇందులో టీడీపీ నేతలు కొంతమంది సీట్లు కొల్పోవాల్సిన పరిస్థితి.
ఇందులో భాగంగానే పనితీరు పేరుతో చంద్రబాబు తమకు టికెట్ నిరాకరిస్తారనే సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు టీడీపీ నేతలు. పార్టీ కోసం పనిచేసేవారిని గుర్తు పెట్టుకుంటానని బాబు చెప్పినా..ఇంతవరకు ఎంత మందిని గుర్తుంచుకుంటారో చెప్పాలంటున్నారు. మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేస్తున్న కామెంట్స్ ప్రజల చేత నవ్వు తెప్పిస్తోంది.
