- Advertisement -

చిలకలూరిపేట టీడీపీలో ముసలం!

- Advertisement -

టీడీపీ పార్టీలో మర్రి రాజశేఖర్ రెడ్డి చేరికపై చిలకలూరిపేట టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని టీడీపీ నేతల అభిప్రాయాలు తీసుకోకుండా అధినాయకత్వం అవమానించింది అని బండారుపల్లి సత్యనారాయణ మండిపడ్డారు.

టీడీపీ నాయకులపై దాడులు, హత్య కేసులు, మానభంగాల కేసులు పెట్టించిన వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లను సైతం జైలుకు పంపించిన చరిత్ర మర్రి రాజశేఖర్ రెడ్డిది అని దుయ్యబట్టారు. టీడీపీలో మర్రి రాజశేఖర్ చేరికను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తాం అని టీడీపీ అధిష్టానాన్ని మెచ్చరించారు.

ఇది ఇలా ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు వైసీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్ రెడ్డి, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -