- Advertisement -

రాజమండ్రి పాల కల్తీపై సీఎం చంద్రబాబు

- Advertisement -

రాజమండ్రిలో వెలుగులోకి వచ్చిన పాల కల్తీ ఘటనపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత గంభీరంగా తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. కల్తీ పాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పూర్తి వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఎవరు కల్తీకి పాల్పడినా ఉపేక్షించే పరిస్థితి లేదని, సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.

అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వివరాలు వెల్లడించారు. ప్రాథమిక పరీక్షల్లో పాలలో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఘటనకు సంబంధించి వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను వెంటనే నిలిపివేశామని చెప్పారు. మరణించిన వారు ఎక్కువగా 58 ఏళ్లకు పైబడిన వృద్ధులని గుర్తించామని వెల్లడించారు. ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలిపారు.

సహాయక చర్యల కోసం ప్రత్యేక రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. లక్షణాలు ఉన్న కుటుంబ సభ్యులను గుర్తిస్తూ వారికి తక్షణ వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. పాల నమూనాలను హైదరాబాద్, విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు పంపామని, ల్యాబ్ నిర్ధారణ అనంతరం చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -