- Advertisement -

బీజేపీ జెండా మోయడమే పవన్‌ పని!

- Advertisement -

కూటమి నాయకులు అమరావతిలో ఉండాలి తెలంగాణలో కాదు అన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అంశంపై స్పందించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి … ఆంధ్రా నాయకులు ఏపీకి, తెలంగాణకు మధ్య షటిల్ ట్రిప్స్ వేయడం మానేయాలి అన్నారు.

తెలంగాణ గురించి వదిలేసి ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి… పవన్ కళ్యాణ్ తన భాషను మార్చుకోవాలి అని సూచించారు గుత్తా.

పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తామని బెదిరించడం ఏంటి?… పవన్ కళ్యాణ్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా? అని ప్రశ్నించారు.

ఏపీ – తెలంగాణ మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారు … జనసేన జెండా.. అజెండా లను పవన్ కళ్యాణ్ పక్కనపెట్టారు అన్నారు. బీజేపీ జెండా మోయటమే పవన్ కళ్యాణ్ పనిగా పెట్టుకున్నారు అని మండిపడ్డారు రామకృష్ణ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -