- Advertisement -
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు నటుడు ప్రకాశ్ రాజ్. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇవ్వబోతోందని పవన్ చేసిన కామెంట్స్‌పై పరోక్షంగా ఆయన పేరు ప్రస్తావించకుండానే రండి దొర.. పొత్తుతోనా.. సింగిల్‌గానా..? అంటూ ప్రశ్నించారు.
మీరొస్తానంటె మేమొద్దంటామా..? రండి దొర.. కానీ వచ్చే ముందు.. ఉత్తుత్తినే వస్తున్నారా..? పొత్తుతో వస్తున్నారా..? లేదంటే సింగిల్‌గా వస్తున్నారా..? అది చెప్పి రండి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేగాదు తనదైన శైలీలో హ్యాష్‌ట్యాగ్ #JustAsking అంటూ ప్రశ్నించారు.
ఇక ఇప్పటికే పవన్‌పై తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. అటూ ఏపీలో వైసీపీతో పాటు కమ్యూనిస్టు నేతలు పవన్‌ను తూర్పారబడుతుండటం విశేషం.
