- Advertisement -

ఎన్నికల వేళ..బీజేపీలోకి కాంగ్రెస్ ఎంపీ!

- Advertisement -

అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగావ్ ఎంపీ ప్రద్యూత్ బోర్డొలోయి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.

బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం… కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మలను కలిసి, అధికారికంగా బీజేపీలో చేరే అవకాశముంది.
ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు.

ఈ పరిణామం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే సీనియర్ నేతలు గౌరవ్ గగోయ్, జితేందర్ సింగ్ ఢిల్లీలోని ఆయన నివాసానికి చేరుకుని చర్చించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే బోర్డొలోయి తన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

బోర్డొలోయి పార్టీ మార్పు అస్సాంలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం కూడా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -