- Advertisement -

ఢిల్లీ పేలుళ్లు..షాకింగ్ వీడియో!

- Advertisement -

నవంబర్ 10న, ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హ్యుందాయ్ i20 కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది మృతి చెందగా, సుమారు 20 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ సీసీటీవీ వీడియోను రిలీజ్ చేశారు పోలీసులు.

15 సెకన్ల క్లిప్‌లో ట్రాఫిక్‌తో నిండిన రోడ్డుపై అకస్మాత్తుగా ఒక భారీ అగ్నిగోళం వెలువడుతూ వాహనాలను దహనం చేస్తూ, చుట్టుపక్కల అవశేషాలు ఎగురుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పేలుడు సాయంత్రం 6:50 గంటలకు జరిగింది.

నవంబర్ 10న బ్లాస్ట్ జరిగే ముందు గంటల వ్యవధిలోనే 8 మందిని, అందులో ముగ్గురు వైద్యులను అరెస్టు చేశారు మరియు 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉమర్ నబీ పేలుడు సమయంలో కారు నడుపుతున్న వ్యక్తిగా గుర్తించారు.

ఈ పేలుడు “అనుకోకుండా ట్రిగ్గర్ అయి ఉండవచ్చు” అంటే తాత్కాలికంగా తయారు చేసిన బాంబును తరలించే సమయంలో ప్రమాదవశాత్తు పేలిపోయినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తు కొనసాగుతుండగా, అధికారులు పేలుడు పదార్థాల స్వభావం మరియు వాటి వినియోగం గురించి మరింత సమాచారం సేకరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -