చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతలు,బాబు కుటుంబ సభ్యుల మాటతీరు చూస్తుంటే నవ్వురాక మానదు. ఎందుకంటే ఆది నుండి బెయిల్ కోసం చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య ప్రచారానికే తెరలేపుతున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ మాటలు అయితే పూర్తిగా అసత్యాలే. జైలులో దోమలతో బాబును చంపే కుట్రచేస్తున్నారని ఆరోపించడంతోనే ఆయన నవ్వుల పాలు కాగా తాజాగా మరోసారి అలాంటి కుట్రకే తెరలేపారు. జైలులో చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని..ఆయన 5 కిలోల బరువు తగ్గారని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే దీనిని డీఐజీ రవికిరణ్ ఖండించారు. చంద్రబాబు పూర్తిగా ఆరోగ్యాంగానే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66 కేజీల బరువు ఉన్నారని ప్రస్తుతం ఒక కేజీ పెరిగి 67 కిలోలకు చేరారన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య చంద్రబాబు ఉన్నారని…ఆయన భద్రతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
ఇక టీడీపీ నేతలు పనిగట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేయడంతో ప్రజల్లో చులకన అవుతున్నారు. దోమలు, కలుషితమైన నీరు, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు అంటూ బాబు ఆరోగ్యంపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయితే ఏకంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ జైలు డాక్టర్లు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో అలాంటిదేమీ లేదని తేలిపోవడంతో టీడీపీ కపటనాటకానికి తెరపడింది.
