- Advertisement -

ఏపీలో భూకంపం..భూకంప తీవ్రత 3.5గా నమోదు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణంలో తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 2.35 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్లు స్వల్పంగా కంపించడంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు చేసినట్లు భూకంప పరిశీలనా కేంద్రాలు వెల్లడించాయి. వినుకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇది భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు. తక్కువ తీవ్రత గల భూకంపం కావడంతో పెద్దగా నష్టం జరగలేదని స్పష్టం చేశారు.

ఇలాంటి స్వల్ప భూకంపాలు అప్పుడప్పుడూ సంభవించడం సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వదంతులను నమ్మకూడదని అధికారులు సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -